BRS Leader Shakeel : బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఆయనను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లో షకీల్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కొంతకాలంగా దుబాయ్‌లో నివాసముంటున్నాడు. అయితే షకీల్ తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. అయితే ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు గురువారం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగాడు. షకీల్ భారత్ కు వస్తున్నాడనే సమాచారంతో అప్పటికే విమానాశ్రయానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో పంజాగుట్ట పోలీసులను మేనేజ్ చేసి తన కుమారుడిని కేసు నుంచి తప్పించేందుకు షకీల్ గతంలో ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిపై కేసు కూడా నమోదైంది. కేసు నమోదు విషయం తెలిసిన షకీల్ భారత్ కు రాకుండా దుబాయ్ లోనే ఉండిపోయాడు. ఇప్పుడు భారతదేశానికి చేరుకున్న తర్వాత హైదరాబాద్ పోలీసులకు వెంటనే అక్కడికి చేరుకుని షకీల్‌ను అరెస్టు చేశారు.అయితే, మాజీ ఎమ్మెల్యే తన తల్లి అంత్యక్రియలకు హాజరు కావడానికి పోలీసులు అనుమతించారు. షకీల్‌ను ఈ సాయంత్రం అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించే అవకాశం ఉంది.