Homeహైదరాబాద్latest Newsఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీపై సీపీ ఆఫీస్ లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు

ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీపై సీపీ ఆఫీస్ లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు

ఇదేనిజం, శేరిలింగంపల్లి: కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం సీపీ కార్యాలయానికి గురువారం సాయంత్రం వెళ్ళారు. ఈ క్రమంలో వారిని లోనికి అనుమతించక పోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకున్నది. దీంతో కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం హరీష్ రావు సర్ది చెప్పడంతో సద్దుమణిగింది. ఆఫీస్ లోనికి కేవలం ముగ్గురిని  అనుమతించడంతో నోయల్ డెవిస్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం వేముల ప్రశాంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ఎమ్మెల్యే గాంధీ సుమారు 20 కిలోమీటర్ల నుండి  బయలుదేరి కౌశిక్ రెడ్డి వస్తున్నది  ప్రతి పోలీస్ స్టేషన్ లో తెలుసని కావాలనే ఇలా చేశారని వారి పూర్తి సహకారం ఉందని మండిపడ్డారు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, అర్ఏస్పీ ప్రవీణ్ కుమార్, కే పీ వివేకానంద తదితరులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img