ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాలు దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుండటంతో విత్తనాలకు డిమాండ్ ఏర్పడింది. ఎండలో పడిగాపులు కాసినా ప్రయోజనం లేకుండా పోతోందని రైతులు అంటున్నారు. తగినంత మేర విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. పరిస్థితిని అదుపు చేసే క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పాకింది. బీఆర్‌ఎస్ నేతలు హరీశ రావు, కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.