BRS పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. త్వరలోనే బీసీ సభను నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డిలోనే ఈ బహిరంగ సభనిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సభకు గులాబీ బాస్ కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆదివారం పార్టీ బీసీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కులగణన నివేదిక, బీసీ రిజ్వేషన్ల అమలు వంటి అంశాలు అజెండాగా సభ జరుగనుంది.