Homeఫ్లాష్ ఫ్లాష్BRS.Minister Niranjan reddy:మంత్రి నిరంజన్ రెడ్డి కి షాక్ -బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన జడ్పి...

BRS.Minister Niranjan reddy:మంత్రి నిరంజన్ రెడ్డి కి షాక్ -బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన జడ్పి చైర్మన్ లోకనాథ్ రెడ్డి ,ఎంపీపీలు, ఎంపీటీసీలు ,సర్పంచులు

BRS.Minister Niranjan reddy:మంత్రి నిరంజన్ రెడ్డి కి స్వంత పార్టీ నేతలు షాక్ ఇచ్చారు ..ఊహించని విధంగా చాలా మంది ప్రజా ప్రతినిధులు బీఆర్ ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరికొంత మంది రాజీనామా చేసేందుకు సిధ్దంగా ఉన్నారని గురువారం ప్రకటించి సంచలనానికి తెరతీశారు .ఎన్నికల ముందు మూకుమ్మడి రాజీనామాల పర్వం మంత్రి నిరంజన్ రెడ్డి కి నష్టం అనే చెప్పాలి.జడ్పి చైర్మన్ లోకనాథ్ రెడ్డి , పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి తో పాటు ఎంపీటీసీలు ,సర్పంచులు,సింగిల్ విండో చైర్మన్ లు రాజీనామా చేస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. రాష్ట్రం లో ఇప్పటివరకు ఏ నియోజక వర్గం లో ఇంత పెద్ద మొత్తంలో రాజీనామా లు జరుగలేదు. తప్పొప్పులు ఎవరివైనా ఇక్కడ జరిగిన ఘటన రాష్ట్రస్థాయిలో చర్చకు తెరలేపుతుంది .

బిఆర్ఎస్ లో ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టలేకే రాజీనామాకు సిద్ధపడినట్లు వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి అన్నారు. గురువారం ఖిల్లా గణపురం మండలం సల్కేలాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతోపాటు పెద్దమందడి ఎంపీపీ మెగా రెడ్డి వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి సల్కెలాపురం మార్కెట్ డైరెక్టర్ చరణ్ కుమార్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి మాట్లాడుతూ మామూలు కార్మికులు సైతం ఆత్మగౌరవం కోరుకుంటారని అలాంటిది ప్రజలిచ్చిన అధికారంలో ఉండి కూడా ఆత్మ గౌరవాన్ని పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా చేసిన మేము ప్రజల్లోకి వెళ్లి ఎందుకు అభివృద్ధి చేయలేకపోయామో ఎందుకు వాగ్దానాలు నెరవేర్చలేకపోయామో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ప్రజలు ప్రత్యామ్నాయం ఎలా సూచిస్తే ఎలా కోరుకుంటే అలాగే ముందుకెళ్తామని ఈ మేరకు మరో 20 రోజుల తర్వాత పాత్రికేయుల సమక్షంలోనే మా కార్యాచరణ వెల్లడిస్తామని వివరించారు.

20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని ఎవరితోనూ ఏనాడు ఒక్క రూపాయి ఆశించకుండా రాజకీయం చేశానని తాను అలా చేసినట్లు లేకపోతే లీగల్ గా సంపాదించలేదని నిరూపిస్తే ఉరి వేసుకునేందుకు సిద్ధమని ఇదే తరహాలో ప్రకటించేందుకు ఉరి వేసుకునేందుకు మంత్రి నిరంజన్ రెడ్డి సిద్ధమా అని బి ఆర్ ఎస్ కు రాజీనామా చేసిన పెద్దమందడి ఎంపీపీ మేఘా రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి సవాల్ విసిరారు. నిరంజన్ రెడ్డకి నీళ్ల నిరంజన్ రెడ్డి పేరు వచ్చేందుకు తమ శ్రమే కారణమని కాకపోతే కాస్త భయంతో ప్రజలు ధైర్యంగా చెప్పేందుకు ముందుకు రాలేకపోతున్నారని ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చింది ఎవరో ప్రజల మనసుల్లో ఉందని త్వరలో ప్రజలు చెప్పే రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వనపర్తిని వనపర్తి వారే పాలించాలని పక్క ప్రాంత వ్యక్తులకు అవకాశం ఇవ్వద్దని వనపర్తి నియోజకవర్గ మేధావులు విద్యావంతులు ఉద్యోగులు యువత ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. నియంత పాలన అంతం కోసం ఇకనుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. బెదిరింపులు పిచ్చి పిచ్చి మాటలు మానుకోకపోతే ఊరుకునేది లేదని తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు ఎంపీటీసీలు మార్కెట్ డైరెక్టర్లతో పాటు మాజీ జెడ్పిటిసిలు ఎంపీటీసీలు సర్పంచులు పలువురు బి ఆర్ ఎస్ కు రాజీనామా చేశారు.

బి ఆర్ ఎస్ కు రాజీనామాలు చేసిన ప్రజా ప్రతినిధులు
బి ఆర్ ఎస్ కు రాజీనామా చేసిన వారిలో జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి తో పాటు వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి పెద్దమందడి సర్పంచు వెంకటస్వామి సాగర్ వెల్టూర్ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి ముందరి తండా సర్పంచ్ జయంతి మంగంపల్లి సర్పంచ్ శారదా మేఘారెడ్డి మణిగిల్ల సర్పంచ్ సరితా తిరుపతిరెడ్డి చీకర్ చెట్టు తండా సర్పంచ్ రాధాకృష్ణ నాయక్ అమ్మపల్లి సర్పంచ్ రమేష్ యాదవ్ స్కూల్ తండా సర్పంచ్ మెగా వత్ సజ్జిని చిలుకటోని పల్లి సర్పంచ్ పద్మకృష్ణ వనపర్తి మండలం సవాయిగూడెం సర్పంచ్ సువర్ణకిచ్చారెడ్డి ఎంపీటీసీలు ఎంపీపీలుగా కొనసాగుతున్న మేఘ రెడ్డి కిచ్చారెడ్డిలతోపాటు కాశీంనగర్ ఎంపీటీసీ నాగరాజు గట్ల ఖానాపూర్ ఎంపీటీసీ దామోదర్ సల్కేలాపురం ఎంపీటీసీ లావణ్య జితేందర్ రెడ్డి వెల్టూరు ఎంపీటీసీ అంజనమ్మ పెద్దమందడి ఎంపీటీసీ భారతి పామిరెడ్డి పల్లి ఎంపీటీసీ ఇందిరమ్మలతో పాటు సుమారు 300 మంది వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు

Recent

- Advertisment -spot_img