పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి ఇంట్లో ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో గూడెం మహిపాల్ రెడ్డి, వారి తమ్ముడు మధుసూదన్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ .. అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ చేసి వేధిస్తున్నారు. మహిపాల్ రెడ్డి గారి నివాసంలో అక్రమ డబ్బు, బంగారం కనీసంగా కూడా దొరకలేదు. ప్రతిదీ ఐటీ రిటర్న్స్‌తో సహా పక్కా వివరాలతో స్పష్టంగా ఉన్నాయి. ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? ప్రతిపక్ష శాసనసభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం లొంగదీసుకోడానికి ఈ దాడులు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా అదే పనిచేస్తోంది.
ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించబోమని, పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పి అందుకు విరుద్ధంగా పనిచేస్తోంది.మా కదలికలను ఇంటెలిజెల్స్ ద్వారా, ఫోన్ల ద్వారా నిఘా పెడుతూ టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. మాట వినకపోతే కేసులు, దాడులతో బెదిరిస్తున్నారు. ఇంట్లో ఉన్న పసిపిల్లలు కూడా ఏడ్చేలా ఈడీ అధికారులు వేధించారు.న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలస్తుంది అని హరీష్ అన్నారు