తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినూత్న నిరసనకు దిగారు. నలుపు దుస్తులు ధరించి, బేడీలతో సభకు హాజరయ్యారు. లగచర్ల రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేడు అసెంబ్లీ లో యంగ్ ఇండియా బిల్లు, యూనివర్సిటీ సవరణ బిల్లులపై చర్చ జరుగుతుంది.