ఇదేనిజం, శేరిలింగంపల్లి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో మంగళవారం ఉదయం చేరారు. ఈ రోజు సాయంత్రం వరకు కల్వకుంట్ల కవితకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు . తీహార్ జైల్లో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు అలాగే తీవ్ర జ్వరంతో కల్వకుంట్ల కవిత చాలాసార్లు అనారోగ్యం బారిన పడగా గతంలో డిల్లీ ఎయిమ్స్ లోనూ పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే. కాగా కవిత గత కొంత కాలంగా గైనిక్ సమస్యలతో బాధ పడుతున్నట్లు అందులో భాగంగానే ఆసుపత్రిలో చేరడం జరిగిందని తెలుస్తోంది.