Homeహైదరాబాద్latest Newsకార్యకర్త కాలుపైకి దూసుకెళ్లిన BRS ఎంపీ కారు

కార్యకర్త కాలుపైకి దూసుకెళ్లిన BRS ఎంపీ కారు

ప్రమాదవశాత్తు BRS ఎంపీ కె.కేశవరావు కారు కార్యకర్త కాళ్లపైకి దూసుకెళ్లింది. దీంతో ఎంపీ కె.కేశవరావు స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో వరంగల్ లోక్‌సభ సన్నాహక సమావేశం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ సమావేశానికి జయశంకర్ భూపాలప్లలి జిల్లా చెల్లూరుకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త శ్రీనివాస్ లంచ్ సమయంలో బయటకు వచ్చారు. అదే సమయంలో కేశవరావు కారు ఆయన కాలుపై నుంచి దూసుకెళ్లింది. దీంతో గాభరాపడిన కేకే వెంటనే ఆయనను ఒమేగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితుడికి ఎక్స్‌రే తీసిన వైద్యులు రెండు ఎముకలు విరిగినట్టు గుర్తించి సిమెంట్ పట్టీ వేసి వైద్యం చేశారు.

Recent

- Advertisment -spot_img