HomeరాజకీయాలుBRS సర్కార్​.. యువతను మత్తులో దింపుతోంది

BRS సర్కార్​.. యువతను మత్తులో దింపుతోంది

– ఎంపీ బండి సంజయ్​ ఆరోపణలు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ సర్కార్ యువతను మత్తుకు బానిసలను చేస్తోందని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. బుధవారం కరీంనగర్​లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్​ఏల్లో బీసీలపై వ్యతిరేకత ఉందన్నారు. బీసీ, దళితులను సీఎం అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించగలదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్ఎస్​కు అమ్ముడుపోతారన్నారు. బీఆర్ఎస్ నుంచి విముక్తి పొందాలంటే బీజేపీని గెలిపించుకోవాలని ఆయన కోరారు. రెండ్రోజుల కిందట కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్​కు బండి సంజయ్ నామినేషన్​ వేసిన సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img