ఇదే నిజం, మంచిర్యాల: మంచిర్యాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడప రాకేష్ గారి పైన ఈ రోజు ఉ. 5:30 నిమిషాలకు మంచిర్యాల ఎమ్మెల్యే గారి ఇంటి సమీపంలో గుండాల దాడి చేయడం జరిగింది, దాడి విషయం తెలుసుకొని హైదరాబాద్ కి మీటింగ్ కోసం వెళ్లిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు. హుటాహుటిన తిరిగి మంచిర్యాల కి వచ్చి మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న గడప రాకేష్ గారిని పరామర్శించి, వారు మీడియా తో మాట్లాడుతూ మంచిర్యాలలో రౌడీయిజానికి తెరలేవ్వడం చాలా దురదృష్టకరమని కావాలనే మా కార్యకర్త పైన దాడి చేశారని వారు అన్నారు. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనను జరగలేదని మరి ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయో మంచిర్యాల ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే దాడి చేసిన వారిని, దాడి చేయించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసు వారిని కోరడం జరిగింది.. ఏ కార్యకర్తకు ఆపద వచ్చిన చూస్తూ ఊరుకోమని, ఇలాంటి గుండా రాజకీయం మంచిర్యాల నియోజకవర్గానికి మంచిది కాదని దాడి చేసిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాడుతామని చెప్పడం జరిగింది.