Homeహైదరాబాద్latest Newsబీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడిగా రాయికల్ పట్టణానికి చెందిన ఎలిగేటి అనిల్ కుమార్

బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడిగా రాయికల్ పట్టణానికి చెందిన ఎలిగేటి అనిల్ కుమార్

ఇదేనిజం, రాయికల్: జగిత్యాల జిల్లా, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావా వసంతసురేశ్, మాజీ మార్కుఫెడ్ చైర్మన్ లోకా బాపురెడ్డిలు రాయికల్ పట్టణానికి చెందిన ఎలిగేటి అనిల్ కుమార్ ను బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షునిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. అనిల్ గతంలో ఆరు సంవత్సరాలు రాయికల్ మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షునిగా పార్టీకి సేవాలందించి, ప్రస్తుతం అతని సతీమణి బీఆర్ఎస్ పార్టీ తరుపున కౌన్సిలర్ గా సేవలు అందిస్తుండడంతో పార్టీ గుర్తించి పట్టణ పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్బంగా అనిల్ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి పై పోరాటం చేస్తూనే పార్టీ కోసం కష్టపడతానని ఎలాంటి వ్యక్తిగత విషయాల జోలికి పోకుండా ఖచ్చితమైన ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి పోషిస్తామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img