Homeహైదరాబాద్latest Newsపార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే గెలుపు : MLA KP Vivekananda

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే గెలుపు : MLA KP Vivekananda

ఇదే నిజం, కుత్బుల్లాపూర్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. అనంతరం కుత్బుల్లాపూర్ డివిజన్ ఐడిపిఎల్ గ్రౌండ్ లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి వాకర్స్ తో సమావేశమై, రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అండర్ పాసులు, ఫ్లైఓవర్లు, లింకు రోడ్ల నిర్మాణంతో ఎంతో అభివృద్ధి చేశామని, రానున్న రోజుల్లో నగరం మరింత అభివృద్ధి చెందాలంటే మరో మారు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో 127 డివిజన్ కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్, 131 డివిజన్ మాజీ కార్పొరేటర్ కే.ఎం.గౌరీష్, బీఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, మాజీ వైస్ చైర్మన్ జయరాం, రంగారెడ్డి డివిజన్ అధ్యక్షులు ఏర్వ శంకరయ్య, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img