Homeహైదరాబాద్latest NewsBRS,BJP బంధం విడదీయరానిది

BRS,BJP బంధం విడదీయరానిది

ఇదే నిజం, ఇనుగుర్తి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ సమ్మెలో అఖిలపక్ష పార్టీలు పాల్గొనగా కేవలం బీఆర్ఎస్ మాత్రమే ఈ సమ్మెకు దూరంగా ఉండటంతో బీఆర్ఎస్, బీజేపీ బంధం విడదీయరానిదని మరోసారి తేటతెల్లమైందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కూరెల్లి సతీష్ ఎద్దేవా చేశారు. దేశంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం చేపట్టిన భారత్ బంద్ మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో విజయవంతం అయింది. బందులో కాంగ్రెస్‌తో పాటు వామపక్ష పార్టీలు, ఆశా వర్కార్లు, కార్మిక యూనియన్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను విమర్శించారు. రద్దు చేసిన కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్నాల కట్టయ్య, ఒర్రె కవిత, చిట్టబోయిన యాకయ్య,రాజేందర్ రెడ్డి, మాంకాల రాము, సలీం, నాగెల్లి సుధీర్,బానోతు వీరన్న,భూక్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img