- గొంతుకోసి హత్య చేసిన ఆటోడ్రైవర్
- చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
ఇదేనిజం, శేరిలింగంపల్లి : చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం… నల్లగండ్ల లక్ష్మి కర్ణాటక సెడెంకు చెందిన విజయలక్ష్మి(32), భర్త , 10 ఏళ్ల కొడుకుతో కలిసి విహార్ ఫేజ్ 1లో నివాసం ఉంటోంది. విజయలక్ష్మి అపర్ణ అపార్టుమెంటులో ఓ ఇంట్లో వంట పనిచేస్తుండగా భర్త కూలీ పని చేస్తుంటాడు. శుక్రవారం మధ్యాహ్నం భరత్ గౌడ్ అలియాస్ శ్రీనివాస్ గౌడ్ ఆటో నడుపుతూనే ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల విజయలక్ష్మి తమ్ముడు తీసుకున్న అప్పు విషయంలో గొడవ జరిగినట్లు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినట్లు సమాచారం. అయితే శుక్రవారం మధ్యాహ్నం భరత్ గౌడ్ విజయలక్ష్మి ఇంటికి వెళ్ళి కత్తి తీసుకొని గొంతు కోయగా అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనా స్థలికి చేరుకున్న క్లూస్ టీం, చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.