ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి హత్యకు గురయ్యాడు. కొంతమంది భారతీయ విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో హర్యానాకు చెందిన నవజీత్ సంధు(22)ను కత్తితో పొడిచారు. ఈ విషయాన్ని ఆయన బంధువు యశ్వీర్ వెల్లడించారు. మెల్బోర్న్లో అద్దె విషయమై ఇద్దరు విద్యార్థుల మధ్య వివాదం నెలకొంది. అయితే ఈ ఘర్షణలో జోక్యం చేసుకునేందుకు నవజీత్ ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన మరో విద్యార్థి నవీజీత్ను కత్తితో ఛాతీపై దారుణంగా పొడవగా అక్కడికక్కడే మృతి చెందాడు.