BSNL వినియోగదారులకు 5జీ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం భారీగా పెట్టుబడులు అవసరం. మొదటగా నిరుపయోగంగా ఉన్న తమ సంస్థ స్థలాలు విక్రయించడం ద్వారా కొన్ని వనరులు సమకూర్చుకోవాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా స్థలాలు, ఖాళీ భవనాలను గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చింది. ఏపీలోని తుని బ్యాంకు కాలనీలో 1.65 ఎకరాలను అమ్మకానికి పెట్టింది. దాని విలువ రూ.12.94 కోట్లుగా నిర్ణయించింది. వివిధ జిల్లాల్లో 470 భవనాల్లోనూ ఖాళీ స్థలాన్ని అద్దెకు ఇవ్వనుంది.