బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవలి కాలంలో తన వినియోగదారుల కోసం అనేక చౌక రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. ప్రభుత్వ టెలికాం కంపెనీ ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే BSNL దెబ్బకు రిలయన్స్ జియో దిగొచ్చిందనే చెప్పాలి. కస్టమర్లను ఆకట్టుకునేలా నూతన రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. రోజుకు రూ.10 సమాన వ్యయంతో 98 రోజుల వ్యాలిడిటీ ఉన్న రూ.999 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో ప్రతి రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 మెసేజులు, అపరిమిత కాలింగ్ లభిస్తాయి. అంతేకాదు అపరిమిత 5జీ ఇంటర్నెట్ యాక్సెస్ సేవను కూడా ఉచితంగా అందిస్తోంది. ఇక జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమా వంటి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్లను కూడా కస్టమర్లు పొందవచ్చు.