BSNL వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కస్టమర్లకు రీఛార్జ్ భారాన్ని తగ్గించడానికి మరో ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో కుటుంబంలోని ముగ్గురు సభ్యులకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం రూ.798 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. ఇది కుటుంబంలోని ముగ్గురికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ప్రధాన సిమ్‌తో పాటు అదనంగా రెండు సిమ్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి సిమ్‌కు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్, 50GB డేటా (150GB వరకు డేటా రోల్‌ఓవర్ సౌకర్యంతో), రోజుకు 100 ఉచిత SMSలు లభిస్తాయి. డేటా లిమిట్ ముగిసిన తర్వాత, స్పీడ్ 40kbpsకి తగ్గుతుంది.