ఇటీవల ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు స్పీమ్ కాల్‌లను నివారించేందుకు చర్యలు చేపట్టే విధంగా కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు BSNL కూడా ముందుకు వచ్చింది. స్పామ్ కాల్‌లను నివారించడానికి కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. స్పామ్ కాల్‌లను నివారించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ చర్యలు చేపట్టింది. మీరు మీ బీఎస్‌ఎన్‌ఎల్ నంబర్‌కు వచ్చే స్పామ్ సందేశాల గురించి వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదులను బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా చేయవచ్చు.