ఇటీవలే ఇతుర ప్రైవేట్ కంపెనీలు తమ టారిఫ్ ప్లాన్‌లను పెంచడంతో వినియోగదారులు అందరూ బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వినియోగదారులని కూడా ఆకర్షించడానికి ప్రభుత్వ నెట్‌వర్క్ బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీ కొత్త రీఛార్జ్ ప్లాన్‌లతో ముందుకు వస్తుంది. ఈ క్రమంలో సరికొత్త ఆఫర్ ప్రవేశపెట్టనుంది.
ఈ సరికొత్త ఆఫర్ ఏంటంటే… BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ ధర రూ.999. ఈ ప్లాన్ దీర్ఘ కాల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ 200 రోజులతో రాబోతోంది. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. కానీ ఈ ప్లాన్ ద్వారా SMS మరియు ఉచిత డేటా సౌకర్యం మాత్రం ఉండదు. అన్ లిమిటెడ్ కాల్స్ వాడే వారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగపడుతుంది. లేదా సెకండ్ సిమ్ వాడుతున్న వారికి ఉపయోగపడుతుంది. మరే ఇతర నెట్‌వర్క్ కంపెనీకి ఇలాంటి ప్లాన్ లేదు.అయితే వినియోగదారులకి అన్ లిమిటెడ్ కాలింగ్ మరియు రోజువారీ డేటా కోరుకునే వారి కోసం బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీ మరో రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. రూ.997 ప్లాన్ వాలిడిటీ 160 రోజులు కలిగి ఉండే ఈ ప్లాన్.. ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్‌లు చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ప్రతిరోజూ 100 ఉచిత SMS లను అందిస్తుంది. రోజుకి హై-స్పీడ్ 2GB డేటాని అందిస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్, డేటా సేవలు అవసరమైన స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఇది ఉత్తమ ఎంపిక అని చెప్పవచు. BSNL కంపెనీ ప్రస్తుతం 2G, 3G, 4G మరియు 5G సేవలను అందిస్తోంది. 2025లో దేశవ్యాప్తంగా 5జీ సేవలను విస్తరించనున్నారు.