తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మొండి చేయి చూపించింది. కేవలం హైదరాబాద్- బెంగళూరు హై విస్తర్ణ పనులకు మాత్రమే బడ్జెట్ కేటాయించింది. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రోడ్లు, ఇతర అంశాలకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీ పై కేంద్రం వరాల జల్లు కురిపించింది. బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత తర్వగా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.