ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా నిరుద్యోగుల కోసం మూడు పథకాలు ప్రారంభించనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ..‘‘సంఘటిత రంగంలో ఈపీఎఫ్‌వోలో నమోదైన కార్మికులకు నెల జీతాన్ని మూడు వాయిదాల్లో ప్రభుత్వం చెల్లిస్తుంది. రూ.లక్షలోపు జీతం ఉన్న ఉద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేలు చొప్పున ఈపీఎఫ్‌వోలో ఉద్యోగి పేరున జమచేస్తాం. 20 కోట్లమంది యువతకు లబ్ధి చేకూరుస్తాం’’ అని చెప్పారు.