బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ.. ‘‘కొత్తగా 109 వంగడాలను ప్రవేశపెట్టాం. కూరగాయల ఉత్పత్తి కోసం ప్రత్యేక క్లస్టర్స్ ఏర్పాటు చేస్తాం. వ్యవసాయ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తాం. వచ్చే ఏడాదిలోపు ప్రకృతి వ్యవసాయానికి కోటి మంది రైతులు వచ్చేలా చూస్తాం. నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంపునకు కృషిచేస్తాం’’ అని అన్నారు.