అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఎన్నికల సమయంలో గ్యారంటీల జల్లు కురిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారి బడ్జెట్లో కేటాయింపులు చేసింది. అందులో రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి రూ.723 కోట్లు కేటాయించింది. అలాగే గృహజ్యోతి పథకానికి రూ.2,418 కోట్ల నిధులు మంజూరు చేసింది.