Homeహైదరాబాద్latest Newsవిద్యుత్ షాక్ తో బర్రె మృతి

విద్యుత్ షాక్ తో బర్రె మృతి

ఇదే నిజం, నార్నూర్ : విద్యుత్ షాక్‌తో బర్రె మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలో జరిగింది. తాడిహడపనూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల బీసీ వాడకు చెందిన విట్టల్ అను యువరైతు కు చెందిన బర్రె కరెంట్ షాక్ తో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. 11 కేవీ కరెంట్ వైర్ కింద పడటంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు బాధితుడు తెలిపాడు.

తన కుటుంబానికి బర్రె మాత్రమే జీవనాధారమని ప్రతిరోజు ఆ బర్రె ఇచ్చిన పాలను అమ్ముకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నానని చెప్పుకొచ్చాడు. లక్ష రూపాయల విలువైన బర్రె మృతి చెందడంతో తన కుటుంబం రోడ్డు పాలైందని బాధితుడు వాపోయాడు. వెటర్నరీ డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించి బర్రెను బాధితునికి అప్పగించారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు నాయకులు స్పందించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితుడు విట్టల్ కోరారు.

Recent

- Advertisment -spot_img