ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ క్రమంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఏపీకి చంద్రబాబు భారీ ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అందులో ముఖ్యమైనది బుల్లెట్ ట్రైన్. రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌తో భేటీ అనంతరం ఏపీకి బుల్లెట్ రైలుపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతికి బుల్లెట్ రైలు వస్తుందని కూటమి ఎంపీలతో చంద్రబాబు శుభవార్త చెప్పారు.అమరావతిని చెన్నై, హైదరాబాద్, బెంగళూరులతో బుల్లెట్ రైలు ద్వారా అనుసంధానం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చంద్రబాబు తెలిపారు. 2026 నుంచి బుల్లెట్ రైలు పనులు ప్రారంభమవుతాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణ వేగం బాగా తగ్గుతుంది. ఈ రైలు గంటకు 320 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది..ప్రస్తుతం హైస్పీడ్ రైళ్లకు రైల్వే ట్రాక్ లు పనిచేయడం లేదని… అందుకే ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు అని తెలిపారు.