గన్నవరం ఎయిర్ పోర్ట్ లో బుల్లెట్ల తో ఒక ప్రయాణికుడి వద్ద బుల్లెట్ల కలకలం రేపింది. విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆర్య అనే విద్యార్థి పోలీసులకు బుల్లెట్లతో దొరికిపోయాడు. విమానాశ్రయ ప్రవేశద్వారం వద్ద విద్యార్థి బ్యాగ్‌లో రెండు బుల్లెట్లను పోలీసులు గుర్తించారు. విద్యార్థి ఆర్య నుంచి బుల్లెట్లను స్వాధీనం చేసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్య అనే యువకుడు కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఢిల్లీ వెళ్లేందుకు ఆయన ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. తనిఖీల్లో ఆర్య బ్యాగులో రెండు బుల్లెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆర్య తండ్రి అనుమతి ఉన్న రివాల్వర్‌లో బుల్లెట్లు ఉన్నాయని ఆర్య చెప్పారు. గత జూలైలో హర్యానా నుంచి వస్తుండగా తన తండ్రి బ్యాగ్ ను తానే తీసుకున్నానని ఆర్య తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.