నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ‘డాకు మహారాజ్’. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం సినిమా ప్రొమోషన్స్ మొదలు పెట్టింది. అందులో భాగంగా జనవరి 4న అమెరికాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అమెరికాలోని టెక్సాస్‌లో జనవరి 4వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే ఈ ఈవెంట్‌కి వెళ్లే అభిమానుల కోసం ప్రముఖ ఓటిటి సంస్థ ‘ఆహా’ అద్భుతమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. మీరు డిసెంబర్ 31లోపు ఆహా గోల్డ్‌కి సబ్‌స్క్రైబ్ చేసుకుంటే, లాంచ్‌లో కూర్చోకుండానే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చూడవచ్చు. అంతేకాదు బాలకృష్ణను కలిసే అవకాశం కూడా దక్కుతుంది. ఎందుకు ఆలస్యం, వెంటనే ఆహా గోల్డ్‌కు సభ్యత్వాన్ని పొందండి. డాకు మహారాజ్‌ని కలవండి అని ఆహా టీమ్ ప్రకటించింది.