టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మెట్రో డీలక్స్ పాస్‌ను తక్కువ ధరకే అందిస్తోంది. హైదరాబాద్ పరిధిలో మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించేందుకు టీజీఎస్ఆర్టీసీ తక్కువ ధరకే నెలవారీ పాస్ తీసుకొచ్చింది. ఈ పాస్ కేవలం రూ. 1450 అందిస్తున్నారు. ఈ పాస్ తీసుకున్న వారికి నెలంతా అపరిమితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. సిటీలో రోజూ బస్సులో ప్రయాణించే వారికి ఇది సౌకర్యంగా ఉంటుంది. ఈ పాస్ తీసుకున్న వ్యక్తులు ఏసీ బస్సులు మినహా మిగిలిన అన్ని బస్సుల్లో ప్రయాణించవచ్చు. అంటే, మీరు మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ మరియు ఆర్టరీ బస్సులలో కూడా వెళ్ళవచ్చు. ఈ పాస్ తీసుకోవడం ద్వారా రోజుకు రూ. 48 రూపాయలు మాత్రమే చెల్లిస్తారు. అంతేకాకుండా ఈ మెట్రో డీలక్స్ బస్ పాస్ ఉన్న వారికి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులపై ప్రత్యేక రాయితీ ఉంటుంది. జిల్లాల్లో ప్రయాణించే ప్రతి టికెట్‌పై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతర్ రాష్ట్ర బస్సులపై కూడా 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ పాస్ ఉంటే ఎక్కడి నుంచైనా వెళ్లవచ్చని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.