Currently, as competition between telecom companies intensifies, companies like jio, Airtel and Vodafone-Idea are offering recharge plans to their customers at very affordable prices.
There are currently billions of jio users in the market across the country. However the company offers the newest recharge plans for its customers.
ప్రస్తుతం టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రతరం కావడంతో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా వంటి సంస్థలు తమ కస్టమర్లకు చాలా తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్కెట్లో కోట్లాది మంది జియో వినియోగదారులు ఉన్నారు. అయితే ఈ సంస్థ తన కస్టమర్ల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది.
రీఛార్జ్ ప్లాన్‌లను రిలయన్స్ జియో వినియోగదారులకు చాలా తక్కువ ధరకు అందిస్తోంది. మీరు Jio యొక్క నెలకు తక్కువ ధరతో రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది.
దీంతో నెలకు కేవలం 100 రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి జియో రూ.1,299 రీఛార్జ్ ప్లాన్ 336 రోజుల వాలిడిటీతో వస్తుంది.
దీని ప్రకారం చూసుకుంటే ఈ రీఛార్జ్ నెలకు 108.25 రూపాయలు ఖర్చు అవుతుంది.
1299 రూపాయల ప్రణాళికలో ప్రత్యేకత ఏమిటి..
జియో యొక్క రూ.1299 రీఛార్జ్‌తో ఏ నెట్‌వర్క్‌లోనైనా 24 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ మరియు 3600 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు ఇవ్వబడుతున్నాయి.
ఈ ప్లాన్‌తో మీకు జియోటివి, జియో సినిమా, జియో మూవీస్ వంటి యాప్‌లలో ఉచిత చందా లభిస్తుంది.
మీరు ప్రతి నెలా దాదాపు 10 జిబి డేటా, 200+ ఎస్ఎంఎస్ మరియు అపరిమిత కాలింగ్‌ను 108.25 రూపాయలకు పొందవచ్చు.
అన్నింటికంటే ఈ రీఛార్జ్ ప్యాకేజీ చౌకదైని చెప్పుకోవచ్చు.
ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ ప్లాన్ కోసం మీరు ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పొడవునా దీన్ని ఉపయోగించవచ్చు.
అంతేకాకుండా అన్ లిమిటెడ్ కాలింగ్స్ కోసం తక్కువ రీఛార్జ్ ప్యాకేజీ కోసం చూస్తున్నట్లయితే ఇదు మీకు అత్యంత ఉపయోగకరం అని చెప్పుకోవచ్చు.
ఈ ప్లాన్‌ను యూజర్లు జియో వెబ్‌సైట్‌లో ఇతరుల విభాగంలో చూసుకోవచ్చు.
ఇది కాకుండా మీరు జియో యొక్క తక్కువ రేట్ రీఛార్జ్ ప్యాకేజీలను చూసుకుంటే.. రెండు ప్రాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
రూ.329 రీఛార్జ్ ప్యాకేజీ..
ఈ ప్లాన్‌లో లభించే ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే 1,000 ఉచిత ఎస్ఎంఎస్, 6 జిబి డేటా మరియు అపరిమిత కాలింగ్ అందిస్తోంది.
దీనితో పాటు 6 జిబి డేటా పరిమితి ముగిసినప్పుడు వినియోగదారులకు 64 కెబిపిఎస్ వేగంతో అదనపు డేటా యాక్సెస్ ప్రయోజనం కూడా లభిస్తుంది.
329 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులకు జియో యాప్‌ల ఉచిత చందా కూడా ఇస్తున్నారు. ఈ ప్యాకేజీ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది.
రూ.149 రీఛార్జ్ ప్యాకేజీ..
ఈ ప్యాకేజీ 24 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఇందులో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 1 జిబి డేటా లభిస్తుంది.
అంటే జియో యొక్క రూ.1,299 రీఛార్జ్ ప్యాకేజీతో మీరు నెలకు రూ .40 ఆదా చేయవచ్చు.