గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విద్యాసంస్థలు, పరిశ్రమల వద్ద గంజాయి అమ్ముతున్న, తాగుతున్న వారి సమాచారం తనకు లేదా పోలీసులకు చేరవేయాలని ప్రజలకు సూచించారు. సమాచారం అందించిన వారికి రూ.5,000 నగదు బహుమానం తన సొంత నిధుల నుంచి ఇస్తానని ప్రకటించారు.