ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా ప్రోమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా అల్లు అర్జున్ ఫాన్స్ యూట్యూబ్ ఛానెల్‌పై దాడి చేసారు. తమ అభిమాన హీరోపై కావాలని నెగిటివ్ వార్తలు, ట్రోల్స్, తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి పరువు తీస్తున్నారంటూ హైదరాబాద్ లోని ఒక యూట్యూబ్ ఛానెల్‌పై ఫాన్స్ దాడి చేసారు. గతంలో ఆ ఛానెల్‌కి కొన్నిసార్లు హెచ్చరించినా మారలేదు అని ఇప్పుడు ఏకంగా దాడికి పాల్పడారు. అల్లుఅర్జున్ పై ఉద్దేశ్యపూర్వకంగా నెగిటివ్ వార్తలు రాయడం కారణంగా ఇలా చేశారన్న తెలుస్తుంది.