ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో తీస్తున్న పుష్ప–2లో షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను చేయనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ గురించి అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి మూడో వారం నుంచి
ఈ సినిమా స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రాబోతుందని.. అండుకే కథ కూడా ముంబయి నేపథ్యంలో జరిగే ఓ పోలీస్ డ్రామా అని టాక్. ఇక జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జత కట్టనున్నారు.