పుష్ప–2 మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన తర్వాతి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో లాంటి సూపర్హిట్ల తర్వాత వీరిద్దరూ మరోసారి జతకట్టారు. త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారని టాక్. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుకున్నఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. భారత స్వాతంత్య్ర ఉద్యమం బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ ఉండనుందని సమాచారం. ఇక, ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్‌తో హరిక, హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు నిర్మించనున్నాయి. డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ – బన్నీ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నాడు. టైటిల్, ఇతర వివరాలను తొందరలోనే రివీల్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.