Homeహైదరాబాద్latest Newsపవర్ స్టార్ కు బర్త్ డే విషెస్ చెప్పిన బన్నీ.. ఈ ట్వీట్ తో వారి...

పవర్ స్టార్ కు బర్త్ డే విషెస్ చెప్పిన బన్నీ.. ఈ ట్వీట్ తో వారి మధ్య వార్ ముగుస్తుందా..?

ఇవాళ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మేనిమోర్ హ్యాపీ రిటర్స్ ఆఫ్ ది డే టు పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్’’ అని ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా పవన్, బన్నీ అభిమానుల మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. పవన్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. తాజాగా బన్నీకి.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతోనైనా ఈ ఫ్యాన్స్ వార్ ముగుస్తుందో లేదో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img