Homeహైదరాబాద్latest Newsతాళం వేసిన ఇంట్లో చోరీ.. బంగారం, వెండి, నగదు మాయం..!

తాళం వేసిన ఇంట్లో చోరీ.. బంగారం, వెండి, నగదు మాయం..!

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం వెంకట్రావు పల్లె గ్రామంలో ఓ ఇంట్లో తెల్లవారుజామున దొంగలు పడి రెండు తులాల బంగారం, 27 తులాల వెండి, 15 వేలు నగదును అపహరించారు. వివరాలకు వెళితే వెంకటరావు పల్లె గ్రామానికి చెందిన పోచంపల్లి పద్మ ఇటీవల వర్షాలకు కూలడంతో పక్కన ఉన్న ఇంట్లో ఉండగా ఇల్లు తాళం పగలగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి వస్తువులు చూసేసరికి బంగారం, వెండి, నగదు దొంగలించినట్లు బాధితురాలు తెలిపారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి వెళ్లి బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై గణేష్ తెలిపారు.

spot_img

Recent

- Advertisment -spot_img