Homeహైదరాబాద్latest NewsBus conductor : బస్సు 6 అడుగులు.. మనిషి 7 అడుగులు.. కండక్టర్ కష్టాలు..!

Bus conductor : బస్సు 6 అడుగులు.. మనిషి 7 అడుగులు.. కండక్టర్ కష్టాలు..!

Bus conductor : ప్రభుత్వ ఉద్యోగం కోసం అందరూ కష్టపడతారు. ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా అని చాలా మంది ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.కానీ ఒక యువకుడికి మాత్రం ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన అది సమస్యగా మారింది. అమీన్ అహ్మద్ అన్సారీ తెలంగాణలోని చంద్రాయణగుట్టకు చెందినవాడు. అతని తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టెబుల్‌గా పనిచేసేవాడు. 2021లో అతని తండ్రి అనారోగ్యం కారణంగా మరణించడంతో, అన్సారీకి బస్ కండక్టర్ ఉద్యోగం ఇచ్చారు.

ఏడడుగుల ఎత్తున్న అమీన్ అహ్మద్ అన్సారీ బస్సు కండక్టర్‌గా నియమించారు. కానీ బస్సు ఎత్తు ఆరు అడుగులు మాత్రమే. అయితే అతను రోజుకు దాదాపు 10 గంటలు తల వంచుకుని పనిచేస్తున్నాడు. దీనివల్ల తనకు చాలా అసౌకర్యం కలుగుతోందని మరియు తాను మెడ నొప్పితో బాధపడుతు హాస్పిటల్ చుటూ తిరుగుతున్నాడు. అన్సారీ పరిస్థితి చూసి ప్రయాణికులందరూ అతనిపై జాలిపడ్డారు. ఈ క్రమంలో బస్సు ప్రయాణికులందరూ అన్సారీకి ట్రాన్స్‌పోర్ట్ డిపోలో మరో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అతనికి రవాణాలో మరో ఉద్యోగం ఇచ్చే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img