నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గంటన్నరగా ఏకధాటిగా కుండపోత వర్షం కురిసింది. దీంతో రైల్వే కమాన్ వద్ద వరద నీరు భారీగా చేరింది. ఈ క్రమంలో బ్రిడ్జి కిందగా వస్తున్న బస్సు వర్షపు నీటిలో చిక్కుకుంది. గమనించిన స్థానికలు, పోలీసులు వెంటనే ప్రయాణికులను కాపాడారు. ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.