HomeతెలంగాణBus trip Tusse Bus యాత్ర తుస్సే

Bus trip Tusse Bus యాత్ర తుస్సే

– చీకటి పాలనకు కర్ణాటక చిరునామా
– తెలంగాణకు నంబర్​ 1 విలన్​ కాంగ్రెస్​
– మంత్రి కేటీఆర్​ ట్వీట్​

ఇదేనిజం, హైదరాబాద్​: కాంగ్రెస్​ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమనడం ఖాయమని మంత్రి కేటీఆర్​ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఈయన ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నంబర్​ 1 విలన్​ కాంగ్రెస్​ పార్టీయేనని ఆరోపించారు. విభజన హామీలపై రాహుల్​ గాంధీ ఎన్డీఏ సర్కారును ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. గత పదేళ్లలో గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు. నిన్నైనా.. నేడైనా.. రేపైనా.. తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే అని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా మండిపడ్డారు.

కాంగ్రెస్‌ను నమ్మేదెవరు?
‘కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ 100 రోజుల్లోనే బొందపెట్టిన పార్టీ మీది. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాది. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ సాగును సంబురంగా మార్చిన పాలన మాది. నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి.. తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే కాంగ్రెస్‌ను నమ్మేదెవరు?’ అని ట్వీట్​ చేశారు.

Recent

- Advertisment -spot_img