Homeహైదరాబాద్latest NewsBusiness Idea: ఆటో డ్రైవర్‌ వినూత్న ఆలోచనతో.. లక్షల్లో సంపాదన.. ఎలాగో తెలుసా!

Business Idea: ఆటో డ్రైవర్‌ వినూత్న ఆలోచనతో.. లక్షల్లో సంపాదన.. ఎలాగో తెలుసా!

Business Idea: సాధారణ ఆటో డ్రైవర్‌ అయిన అశోక్‌, తన వినూత్న ఆలోచనతో వ్యాపార రంగంలో సంచలనం సృష్టించాడు. ముంబయిలోని యూఎస్‌ కాన్సులేట్‌లోకి సందర్శకులు ఫోన్‌లు, బ్యాగులు తీసుకెళ్లేందుకు అనుమతి లేని పరిస్థితిని గమనించిన అశోక్‌, ఈ సమస్యను అవకాశంగా మలచుకున్నాడు. కాన్సులేట్‌ సందర్శకుల బ్యాగులు, ఫోన్‌లను భద్రపరిచే సేవలను ప్రారంభించాడు.

ఒక్కో బ్యాగ్‌కు రూ.1000 వసూలు చేస్తూ, అశోక్‌ నెలకు దాదాపు రూ.8 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. డిగ్రీ లేకపోయినా, యాప్‌ లేకపోయినా, అతని వ్యాపార దృక్పథం అందరినీ ఆకర్షించింది. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా, అశోక్‌ యొక్క ఈ వినూత్న ఆలోచనను ప్రశంసిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. “అవకాశాలను గుర్తించి, సాధారణ సమస్యను వ్యాపారంగా మార్చిన అశోక్‌ నిజంగా ఆదర్శం,” అని హర్ష్‌ పేర్కొన్నారు.

అశోక్‌ ఈ సేవల ద్వారా సందర్శకులకు సౌకర్యాన్ని అందిస్తూనే, తన ఆర్థిక స్థితిని గణనీయంగా మెరుగుపరచుకున్నాడు. అతని ఈ విజయగాథ చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

Recent

- Advertisment -spot_img