బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “పార్టీని వదిలి వెళ్లినవారు కొంతమంది తిరిగి మళ్లీ వస్తామని చెబుతున్నారు. అందులో మంచివాళ్లను తిరిగి చేర్చుకునే విషయం ఆలోచిస్తాం. అరికెపూడి గాంధీ ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదు. త్వరలో శేరిలింగంపల్లిలో ఉపఎన్నిక జరుగుతుంది” అని చెప్పారు.