దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష కూటమి 10 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ రెండు సీట్లకే పరిమితమైంది. మరోచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్లోని 4, హిమాచల్ ప్రదేశ్లోని మూడు, ఉత్తరాఖండ్లోని రెండు, పంజాబ్, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్లోని ఒక్కో స్థానానికి జులై 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది.