హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ‘మిగతా శాఖలకు ఉండే పూర్తి స్వేచ్ఛ హైడ్రాకు వర్తిస్తుంది. దీనికి సంబంధించిన నిబంధనలు సడలించాం. ఆవసరమైన 169 మంది అధికారులు, 964 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని వివిధ శాఖల నుంచి డిప్యుటేషన్ పై రప్పిస్తున్నాం’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.