ప్రమాదంలో ఉంటే ఈ నంబర్లకు ఫోన్ చేయండి.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు..!వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అత్యవసర సహాయం కోసం కమాండ్ కంట్రల్ నంబర్లు 112, 107 ఫోన్ చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం నుంచి సహాయం కోరతామని చంద్రబాబు వివరించారు.