దొంగతనానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాక్ తో ప్రాణాలు విడిచారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో జరిగింది. బోయిన్ పల్లిలోని సోలార్ ప్లాంట్ లో తరచుగా కేబుల్ దొంగతనాలు జరుగుతుండడంతో కంచెకు కరెంట్ షాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మంగళవారం అర్ధరాత్రి చోరీకి వచ్చిన ఇద్దరు కంచె కట్ చేసే క్రమంలో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలంలో ఓ మహిళ కాలు గొలుసు పట్టిలు అక్కడ పడి ఉండడాన్ని గుర్తించామని SI శివ నాగేశ్వర్ తెలిపారు.