– బంగారు తెలంగాణ పేరుతో అప్పులపాలు
– కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
ఇదేనిజం, కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేయగలదా? అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ఆయన కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మంగళవారం ఆయన కరీంనగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీసీని సీఎం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని ఆరోపించారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధమని చెప్పారు. కేవలం బీసీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ వర్గాలు కూడా పేదల రాజ్యం రావాలని ఆలోచిస్తున్నారని చెప్పారు.