Homeహైదరాబాద్latest NewsGYM చేసిన వెంటనే Water తాగొచ్చా?

GYM చేసిన వెంటనే Water తాగొచ్చా?

ఆరోగ్యం కోసం, మానసిక ఒత్తిడులను దూరం చేయడానికి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంపొందించుకోడానికి వ్యాయాయం అనేది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. దీని కోసం కొందరు రెగ్యులర్ గా జిమ్ కి వెళ్తుంటారు. నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి.. జిమ్ తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోండి. చెమట పూర్తిగా ఆగిపోయాక నీళ్లు తాగాలి. ఒకే శ్వాసలో ఒక గ్లాసు నీరు తాగడం మంచిది కాదు. దాహం వేసినా వేయకపోయినా.. సిప్స్ చేస్తూ నీళ్లు తాగాలి. నీటిలో కొంచెం ఉప్పు, పంచదార కలపి తాగండి. ఇది చెమటతో విడుదలయ్యే ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది. మీరు సాధారణ నీటికి బదులుగా కొబ్బరి నీటిని కూడా తీసుకోవచ్చు. జిమ్ తర్వాత 2 గంటల పాటు ఫ్రిజ్ వాటర్ తాగడం మానుకోండి. జిమ్ తర్వాత శరీరంలోని రక్తం వేడిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిల్లో చల్లటి నీరు తాగడం వల్ల హాని జరిగే ప్రమాదముంది. ఫ్రిడ్జ్ నీళ్లకు బదులుగా, కుండలో నీళ్లు తాగడం శ్రేయస్కరం.

Recent

- Advertisment -spot_img