Homeహైదరాబాద్latest Newsలాస్ట్ మినిట్‌లో హ్యాండ్..ఇరకాటంలో అగ్రనేేతలు

లాస్ట్ మినిట్‌లో హ్యాండ్..ఇరకాటంలో అగ్రనేేతలు

ఎన్నికల షెడ్యూల్ విడుదలై టికెట్లు కేటాయించాక లాస్ట్ మినిట్‌లో కొందరు అభ్యర్థులు చేతులెత్తేస్తున్నారు. పార్టీ నుంచి మద్దతు కరవైందని, పోటీనుంచి తప్పుకుంటున్నట్లు సాఫ్ట్‌గా చెప్పి అగ్రనేతలకు బిగ్‌షాక్ ఇస్తున్నారు. దీంతో చివరి నిమిషాల్లో ఏం చేయాలో అర్థంకాక రాజకీయ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీకి ఓ అభ్యర్థి మొండిచేయి చూపగా.. తాజాగా శరోమణి అకాళీ దళ్ పార్టీ నుంచి చండీగఢ్‌ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న హర్దీప్ సింగ్ సైనీ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బులు వేవని, పార్టీ నిధులు కేటాయించట్లేదని చెబుతూ పోటీ నుంచి తప్పుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడానికి ఒక్క రోజు ముందే ఈ విషయం జరగడం గమనార్హం. టికెట్‌ను ఇతరులకు ఇవ్వాలని ఆయన కోరారు. సైనీ బీజేపీలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. చివరి దశలో భాగంగా జూన్ 1 న ఇక్కడ పోలింగ్ జరగనుంది.

Recent

- Advertisment -spot_img