Homeహైదరాబాద్latest Newsహిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలో ఈరోజు ధర్మపురి హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ జరుగుతున్న మరణ హోమం లు కేవలం హిందూ దేవాలయాలను హిందువులను హిందూ ఆడ బిడ్డలను టార్గెట్ చేసి దేవాలయాలను కూల్చు తూ హిందువులను చంపుతూ హిందూ ఆడపిల్లలను రేప్ లు చేస్తూ హిందుత్వాన్ని ,హిందూ ధర్మాన్ని నాశనం చేసే విధంగా వారు అల్లర్లు చేస్తున్న సందర్భంలో ఈరోజు ధర్మపురి హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో చనిపోయిన హిందువులందరికీ కొవ్వొత్తుల నివాళులు అర్పించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంలో హిందూ ఐక్య వేదిక సభ్యులు గాజు భాస్కర్ మాట్లాడుతూ మన భారత ప్రభుత్వం కూడా వెంటనే బంగ్లాదేశ్ లో ఉన్న హిందువు ల అందరినీ క్షేమంగా ఇండియాకు తీసుకువచ్చి బంగ్లాదేశ్ హిందువులందరికీ ఆశ్రయం కల్పించాలని కోరుతూ.. ప్రపంచంలో హిందువులందరికీ ఒకే దేశం అది భారతదేశం. క్రైస్తవులకు ఆపద వస్తే ఆశ్రయం కల్పించేoదుకు ఎన్నో క్రైస్తవ దేశాలు ఉన్నాయి ముస్లింలకు ఆపదా వస్తే ఆశ్రయం కల్పించేందుకు ఎన్నో ముస్లిం దేశాలు ఉన్నాయి కానీ ఒక హిందువులకు ఆపద వస్తే ఆశ్రయం కల్పించేందుకు భారతదేశం మాత్రమే ఉంది కాబట్టి పక్కనున్న దేశాలలో జరిగే మరణ హోమాలను దృష్టిలో ఉంచుకొని మన భారతదేశాన్ని మన హిందూ దేశాన్ని,మాన హిందువులను మనందరం కలిసికట్టుగా రక్షించు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువు పై ఉన్నది కాబట్టి మనమందరం పార్టీలకతీతంగా హిందూ ఐక్యత కోసం పోరాడాలి అని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ధర్మపురి హిందూ ఐక్యవేదిక సభ్యులు పాల్గొనడం జరిగింది.

Recent

- Advertisment -spot_img